Monday, February 8, 2010

"తెలంగాణా బెదుర్స్" - అదుర్స్ నిర్మాత

"తెలంగాణావాదులు మొరిగేకుక్కలు- అవి కరవ లేవు",
"మంచంలోనుండి లేస్తే మనిషిని కాదు - అనడమే కానీ, చేయగలిగింది ఏమీ లేదు".
"తెలంగాణా ఉడతల చప్పుడుకు ఆకులేం రాలవు", "తెలంగాణా ఉద్యమం నేతల్లోనే కానీ ప్రజల్లో లేవు-దానికి నా అదుర్స్ చిత్ర విజయమే నిదర్శనం"
" ఇంత చేవచచ్చిన ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్న ముఖ్యమంత్రి దద్దమ్మ"...
ఇవే కాకుండా ఇంకా తెలంగాణాకోసం అమరులైనవారి గురించికూడా వారి నోటినుండి కొన్ని వ్యాఖ్యలు వెలువడినట్లుగా ఈ రోజు ఆయన ప్రకటనవల్ల అర్థమౌతుంది.

ఈ వ్యాఖ్యలు ఆయన సినిమా బాగా ఆడి, రావాల్సిన లాభాలు దండుకున్నాక మాట్లాడినవి. ఇవే మాటలు సినిమా విడుదలప్పుడు మాట్లాడ లేదెందుకో? -ఎందుకంటే అప్పుడు తన ప్రయోజనం నెరవేరాలి కనుక. ఇప్పుడో....ఏరు దాటాక తెప్పను తగలెయ్యాల్సిందేగా?

ఈ సన్నివేశం తెలంగాణా వాదులకు కనువిప్పు కలిగించాలి. సీమాంధ్రులు తమను ఏ విధంగా మానవేతరప్రాణులుగా, కేవలం తమ సంపాదనకు ఉపయోగపడే వస్తువులుగా పరిగణిస్తున్నారో తెలుసుకోవాలి. వారి తత్వం ఇప్పటికైనా తెలుకుకోగలగాలి. ఇప్పటికీ పౌరుషం రాకుంటే, వచ్చినా దాన్ని సక్రమ మార్గంలో వినియోగించుకోకుంటే.... వాళ్ళు అనేదేం? మనమే సరెండర్ అవుదాం- "మీకు వెట్టిచాకిరీ చేయడానికే పుట్టిన బానిసలమ"ని.

లేదా పౌరుషంతో సరియైన ప్రతిచర్య చేద్దాం.
"ప్రతిచర్య" అంటే కొట్టడం కాదు. తిట్టడం కాదు.వాళ్ళనూ, వాళ్ళ వ్యాపారాలను అడ్డుకోవడం కాదు. కుక్క నిన్ను కరుస్తే నువ్వు కుక్కను తిరిగి కరవడం కాదు. గాంధేయమార్గంలో సరియైన పద్ధతిలో సహాయనిరాకరణ, వారి సేవల తిరస్కారం, వారి ఉత్పత్తులను బహిష్కరించడం చేద్దాం.

చేసే ఉద్యమం వల్ల పిల్లలు కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ జీవితాలను నష్టపోవద్దు. అనవసర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దు. వారి జీవితాలకు కాకున్నాక ఈ ఉద్యమాలెందుకు?

మొదటగా రెండు చేద్దాము.
ఒకటి-
సినిమాల బహిష్కరణ. తెలంగాణావాదులెవ్వరూ ‘తెలంగాణ వచ్చేవరకు’సినిమాలు చూడొద్దని దీక్ష పూనుదాం. ( ఒక్క అదుర్స్ సీనిమాను అడ్డుకుంటామంటేనే.... ప్రపంచం కిందిమీద అయిపోయింది వాళ్ళకు. ఇక ఏ సినిమా నడవకుంటే వాళ్ళకు శ్వాసనే ఆడదు. కాబట్టి ఇది మొదటి నియమం.)

రెండు- ఇక ప్రభుత్వానికీ మన ఉద్యమంసెగ తాకడం లేదు.కాబట్టి, వారికీ తెలిసి వాచ్చేదొక నిర్ణయం తీసుకుందాం.
అది-
"తెలంగాణ వచ్చేవరకు మద్యం ముట్టం". ప్రభుత్వాదాయంలో సింహభాగం మద్యానిదే కనుక ఈ నిర్ణయంవల్ల కలిగే నష్టమే తెలుపుతుంది తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో ఉందో. దాన్ని ఏ లాబీలు దాచిపెట్టలేవు.

ఈ రెండు చేద్దామని జేయేసి ప్రకటించాలి మొదటగా. ఆ తర్వాత వరుసగా ప్రణాళిక వేసుకొని "వచ్చేవారంనుండి ఇదికూడా చేస్తాం" (ఉదా.ఆంధ్రా కార్పోరేట్‌విద్యాసంస్థల్లో మా పిల్లలను చేర్చం...ఇలా)అంటూ మొదటగానే ప్రకటించి, సీమాంధ్రులకూ, ప్రభుత్వానికీ హడలు పుట్టించవచ్చు. తెలంగాణ సాధించనూ వచ్చు.

ఇక అసలు సమస్య- "ప్రకటించగానే సరా? అందరూ దాన్ని పాటించాలిగా? అదెంత కష్టం?" అనేది.
నిజమే. మొదటగా ప్రకటించండి.
తర్వాతచెప్పండి -
" తెలంగాణకోసం లాఠీలదెబ్బలు, బుల్లెట్ దెబ్బలు తిన్న,తింటున్న పిల్లలు నీ పిల్లలు కారా? వాళ్ళంతంత దెబ్బలు తింటుంటే నీకు సినిమా చూడకుంటే నడవదా? మద్యం తాగాల్సిందేనా?

తెలంగాణకోసం ఆత్మత్యాగాలు చేస్తున్నారే? వాళ్ళలా అమరులౌతుంటే కూడా నీ కడుపుకు మద్యం దిగుతుందా? సీనిమా చూడాల్సిందేనా?

తెలంగాణకోసం తమ చదువులనూ అటకెక్కించి, జీవితాలను పణంగా పెట్టి, కేసుల్లో ఇరుక్కుంటున్నారే? అయినా నువ్వు మద్యం తాగి సినిమా చూస్తూ ఆనందించగలుగుతావా?"
-అని.

మొదటి రోజు స్పందన రాక పోవచ్చు. రెండవరోజు కొంత రావచ్చు. వారం తర్వాత ఎందరో ఈ దీక్షను చేపట్టవచ్చు.
ఒకవేళ సరియైన స్పందన లేకుంటే.... పోనీయండి. ‘నాని’ మాటలే నిజమనుకుందాం. ప్రజల్లో ఉద్యమం లేదనుకుందాం.
ఉంటే అందరం పూనుకుందాం.

మరో మాట
నానీ లాంటివాళ్ళు చెప్పుదెబ్బలు కొట్టి, తప్పయిందని కాళ్ళమీద పడతారు. పనయ్యే వరకు మంచిగుండి, పనికాగానే పీకలు నులుముతారు.
కాబట్టి జాగ్రత్త తెలంగాణావాదులారా! మీరే సమయాన కొంచెం వంగినా మీమీద త్రివిక్రములై విక్రమిస్తారీ సీమాంధ్రులు. అలా జరిగితే -మరొక వందేళ్ళైనా తెలంగాణ రాదు. అసలప్పుడు తెలంగాణ అనేదే ఉండదు.

6 comments:

  1. "తెలంగాణ వచ్చేవరకు మద్యం ముట్టం". ప్రభుత్వాదాయంలో సింహభాగం మద్యానిదే కనుక ఈ నిర్ణయంవల్ల కలిగే నష్టమే తెలుపుతుంది తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో ఉందో. దాన్ని ఏ లాబీలు దాచిపెట్టలేవు.

    This oath is quite good my friend. It is a two edged weapon. On one hand people would be shedding a bad habit and on the other hand as part of the agitation, people can show their protest by depriving the Govt of this unproductive income. Great idea.

    ReplyDelete
  2. మరి చుక్క పడకపోతే నిద్ర పట్టని నాయకులు చాలా మందున్నారుగా, వాళ్ళ గతేం కాను?

    ReplyDelete
  3. మంచిఆలోచన ఈ విధంగానైనా కొన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి. ఆమార్పు నాయకులనుంచి ప్రారంభమైతే బాగుంటుంది.వాళ్ళు మారితే దేశం మారినట్లే.అయినా అది అత్యాశేనేమో! ఇది గాంధీగారి కాలం కాదే!బ్రాందీ కాలం కదా! దేశంకోసం,రాష్ట్రం కోసం బ్రాందీ త్యాగం చేసేవారున్నారా?

    ReplyDelete
  4. Whether there is going to be split or not your proposal makes sense!

    As an united Andhra supporter, I strogly support your call for the benefit of the people. Excellent proposal!

    ReplyDelete
  5. అప్పుడు K.C.R. కూతురిని అరెస్ట్ చేసినట్లుగానే ఇప్పుడు ఈ నానిని కూడా అరెస్ట్ చేస్తేసరిపోతుంది. ఎందుకంటారా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో ఇలా సినిమాలు ఆపటంకూడా భాగమని వదరాడు కాబట్టి. కనీసం film chambers association అయినా ఈ ప్రబుధ్ధుణ్ణి బహిష్కరించి వుండాల్సింది.

    మీరు సూచించిన పోరాట విధానాలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  6. Your post is very thought provoking. I am from Andhra and never bothered whether the state is going to be split or not, but I definitely support what you said Vidyaranya. Way to go ....

    Some people are trying to emotionally irritate the Telangaanaa Supporters. Prove them that Telanganaa supporters and fighters are not going to fall in such traps.

    ReplyDelete