Monday, February 15, 2010

"మా నిషాద!.."-తెలంగాణ

భారతీయ వాఙ్మయంలో మొట్టమొదటి శ్లోకం -
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః
యత్ క్రౌంచ మిధునా దేకమవధీః కామమోహితమ్
అనే వాల్మీకివాక్కు.
దీనికర్థం -
"ఓవేటగాడా! నువ్వు పరస్పరప్రేమతో ఉన్న క్రౌంచపక్షులజంటలో
ఒకదానిని అన్యాయంగా చంపేసావు. మరొకదాని దుఃఖానికి హేతువయ్యావు.
నువ్వు బాగుపడవురా! నాశనమై పోతావు" -అని.

ఈ శ్లోకంలోని వేటగాడు వాడొకడే కాదు. రామాయణార్థంలో రావణుడు.
ఆయా కాలాల్లో అందుకు అర్థమైనవాళ్ళూ.
అంతే కాదు మహర్షులు ఒక్కసారి అంటే కోటిసార్లు అన్నట్లు. అంటే అదే మాట
ఈ సృష్టి ఉన్నంతకాలం మాటిమాటికీ ఈ ఆకాశంలో ధ్వనిస్తుందన్నమాట.

ఇక్కడ పక్షులజంటలో ఒక పక్షిని చంపడం అనేది కేవలం సంకేతం. ఏ విధమైన
అన్యాయమైనా, ఇతరులకు చేసే అధర్మం ఏదైనా అదే ఫలితాన్నిస్తుంది. ఈ శ్లోకంలో
క్రౌంచవియోగం కాదు ఆయువు, దానివల్లకలిగిన ‘కడుపుకోత’ ఆయువు.
అన్యాయంగా ఎవరికి కడుపుకోత కలిగించినా ఆ పాపానికి ఫలితం ఈ శ్లోకార్థం.
కడుపుమంట పెత్తినవాళ్ళు సమూలంగా నాశనమౌతారని తాత్పర్యం.
(రావణాసురుడలాగే అయ్యాడు- భంధుమిత్రపరివారసహితంగా.)

నిన్న (ఇదివరకెన్నో సార్లు) విద్యార్థులమీద పోలీసులు లాఠీచార్జీ చేసారు. "లేకుంటే ఆ
పిల్లలు గొడవలు చేయవచ్చుగా?" అందుకే ముందుజాగ్రత్త చర్యగా పొట్టుపొట్టు కొట్టారు.
ఎందుకైనా మంచిదని కరెంటు బంద్ చేసి, రబ్బరుగుండ్ల తూటాలు పేల్చారు.
మరో జలియన్‌వాలాబాగ్‌ను తలపించారు.
ముందుచూపుకలవారైరి, అందుకే మీడియావారినీ నిరోధించారు.లేకుంటే విద్యార్థుల్లో ఉన్న
రాహుకేతువులసంగతి బయటపడుతదాయె వాళ్ళ వీడియోలవల్ల. వాళ్ళేమో అస్మదీయులాయె.

"పిల్లలను అదుపుచేస్తా,వెళ్ళనివ్వండన్న" ప్రొఫేసర్‌నూ నిరోధించారు. ఆయన వెళ్ళి నిజంగానే
పిల్లలను అదుపుచేస్తే మన రాహుకేతువుల సంగతి బయట పడుతుందికదా! అంతే కాకుండా
ఈ మాష్టార్లు మాటలతో బాగానే పిల్లలందరినీ అదుపుచేస్తారు ( అది ఇవాల్టిది కాదు.
పురాణకాలంనుండీ అంతే. పరమదుర్మార్గులైన రాక్షసులు సైతం వాళ్ళగురువు శుక్రాచార్యుని మాట
జవదాట లేదు. అటువంటిది, వట్టి మానవపిల్లలు. వీళ్ళు తప్పక వింటారు) అలా వాళ్ళు అదుపు చేస్తే
"తమ పద్ధతులు(దండం దశగుణం భవేత్) మాత్రమే శాంతిభద్రతల రక్షణకు ఏకైకమార్గమ"నే సూత్ర
రహస్యం బట్టబయలు కాదూ?


చూడవచ్చిన ఆడబిడ్డల్నీ పొట్టుపొట్టు కొట్టి తమ సమధర్మాన్ని నిరూపించుకున్నారు.


ఈ చర్యలతో తెలంగాణాలోని మానవతావాదులందరికీ కడుపుకోత కలిగింది. తెలంగాణతల్లి
తనబిడ్డలపై తేలినవాతలను చూసి తల్లడిల్లింది. "కలకంఠికంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు"
అంటారే! అదికూడా వీళ్ళకు తోచలేదా?ఆడిపిల్లలనెలా కొట్టారయ్యా? వాళ్ళకు పిల్లలు లేరా?కలుగరా?
గొడ్డుమోతులా? అని ఆక్రోశించింది.

ఏమైతేనేం? ప్రస్తుతం తెలంగాణావాదులు కోరుకునేదేమంటే. మాకు ఈ లాఠీదెబ్బలు, తూటాదెబ్బలు
మా తాతలనుండే అలవాటు. నాడు ఆ రజాకర్లు. నేడు ఈ రజాకర్లు. మేముతింటూనే ఉంటాం దెబ్బలు.
కాని, ప్రజలను హింసించినవాళ్ళు సమూలంగా నాశనమయ్యారే తర్వాతి కాలంలో? ఆ దుర్గతి మా
ఈ కాలపు రజాకర్లు అయిన పోలీసన్నలకు, వారిని నడిపించే వారికీ ఈ మానిషాద శ్లోక శాపం కలుగుతుందేమో అని చింతిస్తున్నాము.

మాలోని ఏ కొంచెం పుణ్యమున్నా" ఆ అమాయకులకు(ఆ పోలీసులకు,అధికారులకు, వారి మంత్రులకు, ముఖ్యమంత్రికీ, అధికారపార్టీకి) ఆ శాపం తలగవద్దనీ ఆ ఆదిమహర్షిని వాల్మీకిని వేడుకుంటున్నాము.

5 comments:

  1. ఆంధ్రా వాళ్ళని ఆడిపోసుకున్నందుకే మానిషాద శ్లోక శాపం తగిలి ఇలా జరుగుతోందని మీకర్థం కానందుకు చింతిస్తున్నా

    ReplyDelete
  2. పాపం శమించుగాక.పిల్లలదెబ్బలు చూస్తే చలించడం మానవ లక్షణం. దాన్ని చూసీ ఆనందిస్తున్న మీ(సమైక్యాంధ్ర)ప్రేమ చాలా గొప్పదయ్యా!

    ReplyDelete
  3. తెలుగువాడా,
    ఈ చింతింపులకెవరూ కరిగిపోరు. నక్కజిత్తుల తెలివి తగ్గించి ఏదీ మచ్చుకైనా ఓ కల్పితం లేని ఉదాహరణ చూపించు. ఊరికే ఆడిపోసుకోడానికి ఇక్కడివారికి మీలా తిన్నదరక్క అతి తెలివి ప్రదర్శించే ఓపిక లేదు. తెలంగాణ ప్రజలెవరైనా ఆంధ్ర ప్రాంతంలో మన గలుగుతారా... పోని ఆంధ్ర ప్రజలెవరైనా వారి ప్రాంతంలో తెలంగాణ ప్రజలను దోపిడీదారులుగా చూచారా?

    ఆ శాపం తప్పకుండా ఈ దోపిడీదారుల మీద శాశ్వతంగా వర్తిస్తుంది.

    అవున్లే డబ్బుకోసం చిన్నారి పాపలను బట్టీలో వేసి కాల్చి చంపించే సంస్కృతి మీది. దీనితో పోలిస్తే ఈ దెబ్బల ఆనందం తక్కువే మరి మీకు.

    ReplyDelete
  4. ఈ శాపాల గొడవేంటండీ బాబూ. వీటిల్లో మళ్ళీ తెలంగాణా శాపాలూ, ఆంధ్రా శాపాలూ వుంటాయా కొంపదీసి? నాక్కూడా ఎవరికయినా ఓ శాపం ఇచ్చేయాలని దురదగా వుంది. ఇప్పుడూ అర్జంటుగా ఎవరిని శపించాలబ్బా :(

    ReplyDelete
  5. రెండు రెళ్ళు నాలుగన్నందుకే గుండాలు గుండ్రాళ్ళు విసురుతున్న అంధ రాష్ట్రం లో "రెండు రెళ్ళు నాలుగే నాలుగే నాలుగే రా బేవకూఫ్" అనడానికి గట్స్ వుండాలి. ఎంతో కలేజా కావాలి.

    అవి పుష్కలంగా వున్నాయి కాబట్టే ఉస్మానియా విద్యార్దులంటే ఖాకీలకు ప్రత్యేకించి మక్కెలిరగ తన్నైనా సమైక్యతని (తమ దోపిడీ సామ్రాజ్యాన్ని ) కాపాడుకోవాలని తహ తహ లాడే వలస ఖాకీలకు అంత కసి, అంత కండ కావరం.

    మన పాలోళ్ళు ఎక్కడో ఎప్పుడో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతాన్నితలచుకుని ఇప్పటికీ కన్నీళ్లు పెట్టగలరు. గుండు కెదురుగా గుండె నిలిపిన ప్రకాశం పంతులు ధైర్యాన్ని తలచుకుని ఈనాటికీ పరవశించి పోగలరు. ఒక్క పొట్టి శ్రీరాములు బలిదానాన్ని తలచుకునే తరతరాలు కన్నీళ్లు పెట్ట గలరు.

    కానీ తెలంగాణా లో ఎంతమంది అశువులు బాస్తున్నా వారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. పైగా అదే అవహేళన. అదే స్మశాన సమైక్యతా రాగం.

    అయితే ఉస్మానియా యూనివర్సిటీని యుద్ధ భూమిగా మార్చి , ఉస్మానియా విద్యార్ధులను తాలిబన్లు గా ట్రీట్ చేసి దారుణ మైన దమన కాండ సాగిస్తుంటే ఇంతకూడా చలించని ప్రాంతేతరులను గురించి కాదు ప్రాంతం వాళ్ళని తెలంగాణా చవట, దద్దమ్మ, బానిస నేతలను గురించి ఆలోచించాలి. శపిస్తే గిపిస్తే వీళ్ళని శపిం చాలి. మన తెలంగాణా నేతలకు పుట్ట గతులు లేకుండా చేయాలి.

    " ... ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే ప్రాంతం చివరికి తన్ని తరుముతం - ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణం తోనే పాతర పెడతం..." అని ఎన్నడో అన్నాడు కాళోజీ . ఆ మాటల్ని నిజం చేయాల్సిన తరుణ మిది.
    అప్పుడే తెలంగాణాకు నిజమైన విముక్తి.

    ReplyDelete