Saturday, January 2, 2010

తెలంగాణ ఉద్యోగాలు

"ఆంధ్రులు తెలంగాణ వారి ఉద్యోగాలు కొట్టేస్తున్నారు" అనేదానిని సీమాంధ్రులు తేలికగా కొట్టేస్తున్నారు. అవి కేవలం అబద్ధాల మాటలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. "ఎవరికి తెలివి ఉంటే వారికే ఉద్యోగాలు వస్తాయి" అని ఓ అతితెలివి లాజిక్ ప్రయోగించి స(ఇ)కిలిస్తారు. కానీ ఈ రోజు మా యూనియన్ మిత్రుడితో జరిగిన సంభాషణలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‌‌లో ఉన్న మా ప్రధానకార్యాలయంలో ఇరువయ్యేళ్ళక్రితం(మేము ఉద్యోగంలో చేరేనాటికి) అన్ని పోష్ట్స్ ఉండేవి కావు. ఎంతోమంది క్లర్క్స్, సెక్షన్ ఆఫీసర్స్ మా కళ్ళముందే అక్కడ ఉద్యోగాల్లో చేరారు. అయితే అందరూ తెలంగాణేతరులే.

"వారి నియామకం పత్రికాప్రకటనలద్వారా చేసారా?" అని నేను అడిగా.

"కాదు వారు హైదరాబాద్ ఉపాధికల్పనా కార్యాలయంనుండి కాల్‌లెటర్స్ వస్తే, ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యి, ఉద్యోగాలు సంపాదించార"ని మా యూనియన్ మిత్రుడు తెలిపాడు.

"అదెలా సాధ్యం? హైదరాబాద్ ఎంప్లాయ్‌‌మెంట్ ఎక్స్చేంజ్‌‌లో తెలంగాణేతరులు ఎలా నమోదయ్యారు?" అనేది నా సందేహం.

ఆయన చెప్పాడు "తెలివంటే పుస్తకాల్లోని చదువు అనుకునే స్వాతిముత్యాలకు ఇది విచిత్రం. కాని, బ్రతికే తెలివి ఉన్నవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటాడు. నువ్వు దీనికే ఆశ్చర్యపడుతున్నావు. మన హెడ్ ఆఫీస్‌‌లో పనిచేసే 'ఫలానా' సెక్షన్ ఆఫీసర్ విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో వేరే ఉద్యోగం చేస్తూ, ఇక్కడ అప్పుడే హైదరాబాద్ ఎంప్లాయ్‌‌మెంట్ ఆఫీస్‌‌లో పేరు నమోదు చేసుకొని, కాల్‌లెటర్ తెచ్చుకొన్నాడు" అని.

"ఇన్ని తెలిసిన నువ్వు వీటిపై ఏమి చర్య తీసుకున్నావు?" నా ప్రశ్న.

"మన హెడ్ ఆఫీస్‌‌లో ఎవరెవరు ఎక్కడివారో ఆధారాలతో తెలుపుతూ, 610 జి.వో. అమలు పర్యవేక్షణాధికారి రవికాంత్ రెడ్డి/రమాకాంత్ రెడ్డి (ఆ పేరు మర్చిపోయా) గారికి లేఖలు సమర్పించాము. కానీ ప్రయోజనం ఏమీ లేదు. ప్రభుత వారిది. ఎవ్వరేం చెయ్యలేరు."

"మరి ఇవన్నీ వివరాలు పత్రికలో వస్తే...?"

"ఎంత అమాయకుడవు తమ్మీ! పత్రికల్ల్లో వార్తలకు భయపడినవాడెవడయ్యా? ఆ మధ్యలో గురుకులవిద్యాలయాల్లో దొంగ సర్టిఫికెట్స్ తో ఉపాధ్యాయులుగా చేరినారనే వార్త చదివావా పత్రికల్లో? వాళ్ళు కడప జిల్లావాళ్ళు. అప్పటి ముఖ్యమంత్రి జిల్లావారైరి. వారు ఈరోజుకూ హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారిమీద ఈ నాటికీ ఏ విధమైన విచారణా లేదు. అదే పని నువ్వు చేసి ఉంటే... దానికి కటకటాలు లెక్కపెట్టేవాడివి. అదీ తేడా నీకూ , తెలంగాణేతరుణికీ. "

నా తలకాయ గిర్రున తిరిగింది. అయినా ఇన్ని చెప్పినా మన సమైక్యాంధ్ర అన్నలు బుకాయిస్తూనే ఉంటారు. అయినా వారు కోరే సమైక్యాంధ్ర అందుకేగా?

షరా :- 'దొర' గారు పెద్ద కొత్వాలుగా ఉన్న కాలంలో ఒకేసారి శ్రీకాకుళం జిల్లానుండి ౩౦౦౦ మంది హోంగార్డ్స్‌‌ని తీసుకొన్నారు. ఒకే జిల్లాలో అంతమంది సమర్థులు ఎలా దొరికారో? మిగిలిన జిల్లాల్లో ఎందుకు లేరో? ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్.

4 comments:

  1. శ్రీకాకుళం వాళ్ళు సమర్దులే ఉదాహరణ నేనే

    ReplyDelete
  2. @ప్రవీణ్ గారు. (మిమ్మల్ని గారు అని సంబోదిన్చినందుకు నన్ను ప్ర. పీ. స. స . వాళ్ళు ఎం చేస్తారో..దేవుడా నన్ను నువ్వే కాపాడాలి.)

    మిమ్మల్ని సమర్ధుడు కాదు అన్న వాళ్ళని ఈ ప్రపంచం నుండే వేలేయ్యాలి. మీరెంత సమర్ధులో మీకే తెలియదు. మీ రచనలు చాల గ్రేట్ . నేను మీ 5 మెగావాట్ 'గాలి మర' ని , మీ రచనలున్నాయే అవి ఛాలా అద్బుతం. మీ కామెంట్ లు ఉన్నాయే అవి మరి మరి అధ్బుతం.

    మీ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే www.onlyforpraveen.wordpress.com కి వెళ్లి తెలుసుకోండి.

    (టపాకు సంబంధం లేని వాఖ్య చేసినందుకు విద్యారణ్య గారికి క్షమాపణలతో.)

    ReplyDelete
  3. @Ashok

    you must be from Non-Telangana region....otherwise you wouldn't make such a rude comment.

    I do not see any non-sense with Mr: praveen's comment in this particular page.

    if you want to defer with the post, say it..why you insult the readers????

    ReplyDelete
  4. nijamaina praveen kaadandee , profile choodandi kaavalante, fake praveen

    ReplyDelete