Friday, January 1, 2010

ఆంధ్రా సి.యం.ను అనే అర్హత తెలంగాణీయులకు లేదు

అయ్యలారా తెలంగాణావాదులారా!

మీరు అనవసరంగా రోషయ్యగారిని అపార్థం చేసుకుంటున్నారు " ఈయన మమ్మల్ని ఒకతీరు, సీమాంధ్రులని ఒకతీరు చూస్తున్నాడు" అంటూ.
కానీ, ఇందులో ఆయన తప్పేమీ లేదు.అంతా శాస్త్రోక్తమే జరుగుతుంది. ఎందుకంటే వారు ఒక్క తెలంగాణాకో, మరే ప్రాంతానికో మాత్రమే ముఖ్యమంత్రి కారు.వారు ప్రస్తుతమున్న సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రివర్యులు. మీరా విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి సమైక్యాంధ్ర ఉద్యమకారులకు వారు సహకరించడం తప్పు కాదు. అందులో ప్రాంతీయ తత్వం అస్సలు లేదు. ప్రస్తుతం మీరూ సమైక్యాంధ్రలోనే ఉన్నారు. గుర్తుంచుకోండి. అంటే వారు తమరిపక్షమూ వహించారని తాత్పర్యం. అది ప్రభుత్వపాలసీని చక్కగా అమలు పర్చడం అన్నమాట. అందుకే వారూ, వారి రజాకర్లూ పాటు పడతారు.అది తథ్యం. అర్థం చేసుకోలేకపోతె అది తమ ఖర్మ.

ఇక మరోవాదం.తెలంగాణా వాదులని అన్యాయంగా అణచివేస్తున్నారని. అయ్యా! తమరిది వేర్పాటువాదం. తమరు వేరువడి మీ ప్రాంతాన్ని పక్కనున్న పాలి దేశంలో కలుపుదామని చూస్తున్నారు. కాబట్టి వేర్పాటువాదాన్ని,వాదులనూ ఏ ప్రభుత్వమూ సహించదు కాక సహించదు. అందులోనూ తప్పేమీ లేదు. అదీ శాస్త్రోక్తమే!

ఇక ప్రత్యేకాంధ్ర ఉద్యమకారులను ఎలా చూస్తున్నరో నాకు తెలీదు కానీ వారి పట్ల కొంచెం ఎక్కువ సమదృష్టితో చూస్తే తప్పేమీ లేదు. ఎందుకంటే ఎవరికైనా జన్మభూమిపై మమకారం ఉండి తీరాల్సిందే. ఉండకుంటేనే తప్పు.

కాబట్టి తెలంగాణావాదులారా అందరూ మూస్కొని, రోషయ్యవారి మహత్వపూర్ణమైన పరిపాలనను వేనోళ్ళ పొగడండి.పుణ్యం వస్తుంది.

2 comments:

  1. ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.

    ReplyDelete
  2. సమైక్యవాదం హైదరాబాద్ అనే ఏకైక స్తంభాన్ని ఆశ్రయించి రూపొందించుకున్నది. దాన్ని తీసేస్తే వారికి మిగిలిందేమీ లేదు. వాస్తవానికి హైదరాబాదు కోసం, హైదరాబాదు మీద వచ్చే ఆదాయం కోసం గింజుకుంటున్నది సమైక్య సెంటిమెంటు.

    స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం ,
    స్వయం పాలన కోసం ,
    ఆత్మ గౌరవం కోసం ,
    అస్తిత్వం కోసం తెలంగాణా ప్రజలు శతాబ్దాలుగా పరితపిస్తున్నారు


    1956 లో "మీది తెలుగే - మాది తెలుగే " అనే జిత్తులమారి నినాదం తో ,
    దగాకోరు ఒప్పందాలతో రెండు రాష్ట్రాల విలీనం జరిగి తెలంగాణా తిరిగి తన అస్తిత్వాన్ని కోల్పోయింది .

    తెలంగాణా ప్రజలు తమ నేలమీద తామే కాన్దీశీకుల్లా ... ఇంకొకరి దయధర్మాలతో బిక్కు బిక్కు మంటూ బతుకీడ్వాల్సిన దుస్తితి ఏర్పడింది .

    విలీనమప్పుడు కుదుర్చు కున్న దగుల్భాజీ ఒప్పందాలన్నీ ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో , తెలంగాణా నిధులూ , నీళ్ళూ , వనరులూ , ఉద్యోగాలూ ఎలా దోపిడీకి గురయ్యాయో , తెలంగాణా ప్రజల భాషా సంస్కృతులు , చరిత్ర ఏవిధంగా అవహేళనకు గురయ్యాయో మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు .

    తెలంగాణా ఇప్పుడు
    స్వాతంత్ర్యం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం , న్యాయం కోసం , అస్తిత్వం కోసం పరితపిస్తోంది . అణువణువునా జ్వలిస్తోంది .

    తెలంగాణా ప్రజలు "తమ రాష్ట్రం తమకు కావాలని , తమ నిధులు , తమ వనరులు , తమ ఉద్యోగాలు తమకు దక్కాలని ...నీళ్ళలో తమ వాటా తమకు సక్రమంగా రావాలని , తమ భాషా సంస్కృతులకూ చరిత్రకూ సముచిత గౌరవం వుండాలని కోరుకుంటున్నారు ... తప్ప ఇతర్ల సొమ్మును ఏమీ ఆశించడం లేదు .

    న్యాయం తెలంగాణా ప్రజల పక్షాన వుంది .

    తెలంగానాది ధర్మ యుద్ధం . ధర్మం చర ... సత్యం వద ...!

    తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరుతుంది .

    ప్రాంతాలకు , పక్షపాతాలకు , స్వార్ధానికి , అవకాశవాదానికి అతీతంగా నీతీ నిజాయితీ పరులైన తెలుగువాల్లంతా తెలంగాణా పోరాటానికి సంఘీభావం తెలపాలి .

    సర్వే జనా సుఖినో భవంతు.
    అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete