Wednesday, December 30, 2009

తెలంగాణా(అ)మిత్రులకు ......

ఈ రోజు విశ్వామిత్రులవారి బ్లాగ్‌‌లో చదివాను. పాపంవారికి తెలంగాణా అమాయకులపై ఎంత దయ? వారంటారు...

"తెలంగాణావిషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు
వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.
కానీ
ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ
పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో
పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది."

అని.

... కానీ వారికీ విషయం తెలియదంటారా? దానికి నేను రాసిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నా.( నాకో అనుమానం నా సమాధానాన్ని వారు ప్రచురించరేమో అని. తెలుగుసేవవారి అటువంటి సేవ చూసాముగా?)

అయ్యా విశ్వామిత్రవర్యా!
ఉద్యోగాలు మీరన్నట్లు పోటీ పరీక్షలు రాసి, ప్రతిభను ప్రదర్శించినవారికే వస్తాయి.కానీ,పాపం కొందరు అల్పజీవులు ఉంటారు. ఏదో ఇంత ఇంటర్,టిటిసి చేసి చిన్న బడిపంతులు ఉద్యోగం చేసుకొని బకుదామని ఆశ పడతారు.వారికి వారివారి జిల్లాల్లో ఉండే మన ప్రభుత్వం వారు ఎలెక్షన్స్ ముందు పెట్టే ఉద్యోగాలజాతరలో ఉద్యోగాలు రావాలి. అవేమో పరిమిత సంఖ్యలో ఉంటాయాయె. వేరే జిల్లాల్లోకేమో( ఈ అమాయకులకు)వెళ్ళరాదాయె. అయ్యా! అక్కడుంది కిటుకు. "ఆ స్థానిక ఉద్యోగాల్లో" ఆ జిల్లావాడుకాని అస్మదీయులు ఉద్యోగాలు సంపాదిస్తారు. పాపం ఈ అమాయకజీవులు మరోసారి రాయలసీమ మారాజు గారో, కోస్తా మారాజుగారొ వచ్చే ఎలెక్షన్స్ ముందు ప్రకటించే అబద్ధపు,తనకు రాని ఉద్యోగం కోసం చొంగ కార్చుకుంటూ కూర్చొంటారు.
( మీకేమైనా సందేహముంటే,హైదరాబాద్ దగ్గరలో ఉన్న మెదక్ జిల్లాలో చూడండి. ఎంతమంది తెలంగాణేతరులు స్థానిక ఉద్యోగాల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇదైతే అబద్ధం కాదుగా? వస్తారా? లెక్కలు చూసుకుందాము.)

షరా:- విశ్వామిత్రులకు ధన్యవాదాలు.వారు నా సమాధానాన్ని ప్రచురించి, ఏదో సమాధానమైతే రాసినందులకు.

4 comments:

  1. ఇక్కడ ఎవరూ కూడా తార్కికంగా ఆలోచించటం లేదు. మనం అందరం ఒక్క తల్లి బిడ్డలమే అయినా కానీ ఇలా కుక్కల్లా కోట్లాడుకోవడం మాత్రం ఏమి బావో లేదు. రాజకీయాల్లో సరైన పరిష్కారం లేదా తప్పు పరిష్కారం అంటూ ఉండవు. కేవలం మన సౌలబ్యం కోసం మనం అందరికీ అమూదయోగ్యం ఐన పరిష్కారం కనుక్కోవటం మాత్రం కావలి. ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని మనమే కరెక్ట్ అనుకునే నైజం పోవాలి. ఆంద్ర వాళ్ళు పోగారుబోతులని, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులని ఇలాంటి gross generalizations చేసుకోవటం మన అవివేకం కాదా? మనవ సంబందాలు తెగిపోయాక ఇక కలిసున్నాలేకపోయినా పెద్ద లాబం లేదు. ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం. అలాగే హైదరాబాదు అభివృద్ధిలో అందరి చేయి ఉంది, కానీ ఇప్పుడు దానిని వదిలెయ్యాలి అనటం పూర్తీ గా అన్యాయం. ఇలాంటి పరిస్తితులలో చదువుకున్న మనం ప్రస్తుతం సంయమనం పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పాటు పడేలా ప్రోత్సహించాలి. అంతే కాని రోజు రోజుకి పడిపోతున్న సౌబ్రాతుత్వాన్ని మరింత తొక్కి మనకి మనం ఏమి మంచి చేసుకోవటం లేదు. Negotiations అందరికి అన్ని లాబాలు జరగవు, మనం కొన్ని పక్కవారి విషయంలో పస ఎంత ఉంది అనేది అలోచించి సర్దుకు పోవడం ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యం, ఇది జీవన్మరణ సమస్య కాదు. కాని మనల్ని మనం కించ పరుచుకుమ్తున్న విదానం మాత్రం హేయం. అందరం కలుద్దాం పరిష్కారం వెతుకుదాం. రాజకీయంగా కాదు. బ్లాగు పరంగా. ఏమంటారు? కనీసం ఇక్కడైనా మనం వివేకులం అని చెప్దాం. సరైన బ్లాగ్ తయారు చేద్దాం, ఫోరం తయారు చేద్దాం, అందరికి నచ్చేట్టుగా నాయకులను (moderators) ఎన్నుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి మనం పరిష్కారం చర్చిద్దాం. ఇది నేను అన్ని బ్లాగులలో పోస్టు చేస్తున్నాను. దయచేసి అందరం దగ్గరికి వద్దాం. విషం చిమ్ముకోవటం ఆపేద్దాం.

    ReplyDelete
  2. విజయ్‌‌గారి ప్రతిపాదనేదో బాగానే ఉందే!

    ReplyDelete
  3. @విజయ్:చాలా unrealistic ప్రతిపాదన చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఏ అభిప్రాయమూ ఈ విషయంలో నిలబడదు. We are political... no matter how much of intellectualism anyone boasts of.

    ReplyDelete
  4. Viyay garu this is 2010, not 1953.
    wake up!!!

    ReplyDelete